మిక్స్‌డ్ డబుల్స్‌ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పేస్-సానియా

Updated: Friday, August 3, 2012, 10:26 [IST]

Paes-Sania enter quarterfinals of the mixed doubles event
లండన్, ఆగస్టు 3: ఒలింపిక్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ లియాండర్ పేస్ - సానియా మిర్జా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో మ్యాచ్‌లో పేస్-సానియా జోడి 6-2, 6-4 స్కోరుతో జిమోన్‌జిక్-ఇవనోవిక్ (సెర్బియా)పై ఘన విజయం సాధించింది. 64 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో భారత జోడి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ప్రత్యర్ది సర్వీస్‌ను మూడో గేమ్‌‌లోనే బ్రేక్ చేసింది.

తొలి సెట్‌లో ఇరు జట్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2-2 తో సమమైంది. అలాగే ఐదో గేమ్‌, ఏడో గేమ్‌కు మరోసారి సెర్బియా జట్టుకు చెక్‌ పెట్టిన పేస్‌ జోడీ తొలి సెట్‌ను 26 నిమిషాల్లో ముగించి 6-2 తేడాతో కైవసం చేసుకుంది. ఎనిమిది, తొమ్మిది గేమ్‌లను ఇద్దరూ నిలబెట్టుకోవడంతో స్కోరు 5-3 వద్ద నిలిచింది. అయితే పదో గేమ్‌ను నిలబెట్టుకున్న భారత్ సెట్‌తో మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

ఇప్పటికే భారత టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భూపతి-బోపన్న, లియాండర్ పేస్-విష్ణువర్దన్ పోటీల నుండి వైదొలగడంతో మిక్స్‌డ్ డబుల్స్ పై అందరి దృష్టి పడింది. క్వార్టర్స్‌లో పేస్-సానియా జంట టాప్ సీడ్ మ్యాక్స్ మిర్ని-విక్టోరియా అజరెంకా (బెలారస్)తో తలపడుతుంది.

తెలుగు వన్ఇండియా

Story first published: Friday, August 03, 2012, 09:40 [IST]
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS