పద్మనాభ స్వామి ఆరో గదిపై బుధవారం దాకా ఉత్కంఠ

Published: Friday, September 16, 2011, 14:39 [IST]

Sri Padmanabhaswamy Temple
న్యూఢిల్లీ: తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలోని ఆరో గదిని తెరవడంపై ఉత్కంఠకు తెర పడలేదు. బుధవారం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. దానిపై ఈ నెల 21వ తేదీ బుధవారం నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అనంత పద్మనాభ స్వామి ఆరో గదిని తెరిచే విషయంపై నిపుణుల కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. ఆ గదిని తెరవాలంటే మరింత భద్రత అవసరమని కమిటీ అభిప్రాయపడింది.

ఆరో గదిపై తమ నిర్ణయం సంప్రదాయాలకు, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగానే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సంపద సంరక్షణకు సడలింపులు కూడా ఉంటాయని చెప్పింది. సంపదను ఆలయంలోనే ఉంచాలని కమిటీ అభిప్రాయపడింది. ఆరో గదిని తెరవకూడదని, సంపదను వీడియో, ఫొటో తీయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ట్రాంవకోర్ రాచకుటుంబం అభిప్రాయపడింది.

Story first published: Friday, September 16, 2011, 14:39 [IST]
Topics: anantha padmanabha swamy, kerala, tiruvananthapuram, supreme court, new delhi, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కేరళ, తిరువనంతపురం, సుప్రీంకోర్టు, న్యూఢిల్లీ
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS