‘మర్యాద రామన్న’హిందీ రీమేక్‌గా విడుదల తేదీ ఖరారు

Published: Thursday, August 23, 2012, 10:13 [IST]

ముంబై : అజయ్‌దేవగన్, సొనాక్షిసిన్హా, సంజయ్‌దత్, జుహీచావ్లా తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సన్నాఫ్ సర్దార్'. తెలుగులో సునిల్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న'కి ఇది రీమేక్. అజయ్‌దేవగన్ మాస్ హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ ధీర్. నవంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో జూహీ ఛావ్లా,సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. మొదట ఈ టైటిల్ ని అక్షయ్ నమోదు చేసుకున్నారు కానీ అజయ్ రిక్వెస్ట్ పై ఇచ్చేసారు.

అలాగే ఈ చిత్రం పంజాబ్ పాటియాలా నేపద్యంలో జరుగుతుంది. ప్రత్యేకమైన ఇంటిసెట్ వేసి భారీగా ఈ చిత్రాన్ని షూట్ చేసారు. అజయ్ దేవగన్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు. ఈ కామిడీ చిత్రం చూడగానే అజయ్ దేవగన్ నచ్చి ఈ ప్రపోజల్ కి వచ్చారు. అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు. అవి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాయి. పూర్తి ఫన్ ని ప్రతిబింబించేలా ఆ పోస్టర్స్ రూపొందించారు. ఇక ఈ చిత్రం కథ విషయానకి వస్తే.. హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం ఇప్పటికే ఎనభై కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్ వచ్చిందని, సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ రేంజి బిజినెస్ కావటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం అజయ్ దేవగన్ రీసెంట్ చిత్రం సింగం అని చెప్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఎఫెక్ట్ మర్యాద రామన్న రీమేక్ పై పడింది.

మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై ఆ మధ్యన విడుదలైంది. అక్కడా మంచి టాక్ తో వెళ్లిందని టాక్. అయితే చిత్రం దూకుడు విడుదల సమయంలో విడుదలకావటంతో దెబ్బైంది. ఇక కోమల్ అనే ఆర్టిస్టు మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.

ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు రీమేక్ హిందీలో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా చేసారు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రౌడీ రాధోర్ టైటిల్ తో విడుదల అయిన ఈ చిత్రం సూపర్ హిట్ కావటంతో ఈ మర్యాద రామన్న రీమేక్ పైనా ట్రైడ్ లో బాగా నమ్మకాలు వచ్చాయి.

Story first published: Thursday, August 23, 2012, 10:13 [IST]
Topics: maryada ramanna ajay devgan sunil మర్యాద రామన్న అజయ్ దేవగన్ సునీల్
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS