జైలులో 'జఫ్ఫా'బ్రహ్మానందం

Published: Sunday, July 15, 2012, 9:03 [IST]

హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'జఫ్ఫా'. విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం కథ పూర్తిగా జైల్లో జరగనుంది. కిరణ్‌ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై రమేష్‌వర్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ...''జైలు నేపథ్యంలో సాగే కథ ఇది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జఫ్ఫాగా బ్రహ్మానందం నటన ఆద్యంతం అలరిస్తుంది. నాలుగు పాటలున్నాయి. ఆ పాటల్లోనూ కావల్సినంత వినోదాన్ని మేళవించాం. సునీల్‌ కాశ్యప్‌ మంచి బాణీలను అందించారు'' అని తెలిపారు.


ఇక ఈ చిత్రం ట్రైలర్ ఆ మధ్యన విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం..సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారి..నీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు,రేప్ చేయలేదు,కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.


అందిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం జఫ్పా ఖాన్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. ఇండియన్ పోలీసులుకు చిక్కిన పాకిస్ధాన్ టెర్రరిస్ట్ జఫ్ఫా ఖాన్. ఇండియన్ జైలు నుంచి అతను ఎలా తప్పించుకున్నాడనేది కథలో కీలకాంశంగా ఉంటుంది. అలాగే అతని పోలికలతోనే ఉన్న మరో అమాయిక బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని బయిటపడాలనుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కామిడీతో జరిగే కథనం. అలాగే బ్రహ్మానందం తన ఒరిజనల్ తెల్ల గెడ్డంతో జఫ్ఫా ఖాన్ పాత్రలో కనపిస్తారు.


ఈ చిత్రం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. మిగతా కీలక పాత్రల్లో రఘుబాబు, అలీ, వేణుమాధవ్‌, శ్రవణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: నవీన్‌.

Story first published: Sunday, July 15, 2012, 09:03 [IST]
Topics: brahmanandam jaffa dookudu బ్రహ్మానందం జఫ్పా దూకుడు
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS