పూరిని గోకింది... బాలీవుడ్‌కి పాకింది!

Updated: Thursday, August 23, 2012, 14:46 [IST]

హైదరాబాద్: పూరి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో ఐటం సాంగు చేసిన బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బెర్టాంటె. తాజాగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోకి కూడా ఈ పాపను తీసుకున్నాడు పూరి. పూరి చిత్రంలో ఐటం సాంగులో ఏ రేంజిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు.

పూరి జగన్నాథ్‌‌తో పరిచయం ఎలా ఏర్పడిందో తెలియదు కానీ... బాలీవుడ్‌కి పాకడమే లక్ష్యంగా పూరికి క్లోజ్ అయిన ఈ బ్రెజిల్ పాప పూరి సినిమాల్లో అవకాశం దక్కించుకోవడంతో పాటు అతని ద్వారా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది. తాజాగా గాబ్రియేలా బాలీవుడ్ మూవీ ‘బల్విందర్ సింగ్..ఫేమస్ హోగయా' చిత్రంలోని మూడు ముఖ్య పాత్రల్లో ఒక పాత్రను పోషిస్తోంది.

ఇతర రెండు పాత్రలను ప్రముఖ సింగర్స్ మికా సింగ్, షాన్ పోషిస్తున్నారు. సునీల్ అగ్ని హోత్రి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బికినీ సీన్లలో గాబ్రియేలా అందాలు యమరంజుగా ఉంటాయి. ఇప్పటికే అనేక ఫోటో షూట్లలో సెక్సీ బికినీలు వేసి తన అందాలతోనే యూత్‌‌కి కిక్కెక్కించింది. అందుకే ఆమెను ఈచిత్రానికి ఎంపిక చేశారు.

కాగా... ఇటీవల విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో గాబ్రియేలా చేసిన ‘డిస్టర్బ్ చేస్తున్నాడే..' సాంగకు పెద్దగా మార్కులు పడలేదు. బికినీలు వేసి చూపించాల్సిన ఆమెను పూర్తిగా బట్టలేసి చూపించడంతో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదనే టాక్ వినిపిస్తోంది.

Story first published: Thursday, August 23, 2012, 12:45 [IST]
Topics: pawan kalyan gabriela bertante cameraman ganga tho rambabu tamanna పవన్ కళ్యాణ్ గాబ్రియేలా బెర్టాంటె తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS