బాలయ్య మ్యాటర్‌ను ఖండించిన తాప్సీ

Published: Monday, July 2, 2012, 13:36 [IST]

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ‘ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999' చిత్రం చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల తాప్సీని తీసుకున్నారనే వార్తలు వినిపించాయి.

ఈ విషయమై తాప్సీ స్పందిస్తూ...తాను బాలకృష్ణతో కలిసి నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ‘ఆదిత్య 999' చిత్రానికి తాను సైన్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, అవన్నీ వట్టి రూమర్లే అని తాప్సీ స్పష్టం చేసింది. ఎవరో కావాలని ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చింది ఈ ఢిల్లీ భామ.

‘ఆదిత్య 999' ఈ చిత్రానికి సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాప్సీ ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలు, ఓ హిందీ చిత్రం, ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మంచు లక్ష్మి నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి' చిత్రంతో పాటు, షాడో చిత్రంలో వెంకీ సరసన నిటిస్తోంది. హిందీలో Chashme Baddoor చిత్రంతో పాటు Maranthen Mannithen అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ' చిత్రం చేస్తున్నారు.

Story first published: Monday, July 02, 2012, 13:36 [IST]
Topics: balakrishna tapsi anushka బాలకృష్ణ అనుష్క తాప్సీ
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS