'కెమెరామెన్‌ గంగతో...' పై రూమర్ నిజమైంది

Updated: Thursday, August 23, 2012, 11:27 [IST]

Pawan Kalyan
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ మొదట అక్టోబర్ 18న ఫిక్స్ చేసారు. దాన్ని అక్టోబర్ 11 కి మార్చనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అది రూమర్ అని అందరూ కొట్టి పారేసినా పవన్ అనుమతితో అది నిజమైనందని విశ్వసనీయ సమాచారం. సాధారణంగా రిలీజ్ డేట్స్ షూటింగ్స్ పూర్తవకో,బిజినెస్ లేటయ్యో ముందుకు పోతూంటాయి..కానీ పూరి రివర్స్ లో ..ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తూ అతి తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేయటమే కాకుండా ముందు అనుకున్న విడుదల తేదీని కూడా కాదని,ముందుకు రిలీజ్ డేట్ తెచ్చి షాక్ ఇస్తున్నారు. ఇది పవన్ అభిమానులకే కాక అందరికీ ఆనందం కలిగించే విషయం.

అనుకున్న దానికంటే షూటింగ్ పూర్తవుతుండటంతో ఈ మార్పులకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ రామోజీఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ జరిగే షూటింగుతో టాకీ పార్టు పూర్తవడంతో పాటు మేజర్ ఫైట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు, మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ సెప్టెంబర్ నెలలో పూర్తికానున్నాయి.అక్టోబర్ 3వ తేదీ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉండటంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు అనకున్నదానికంటే వారం రోజుల ముందే అంటే అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గతంలోనూ బిజినెస్ మ్యాన్ విషయంలోనూ పూరి ఇదే విధంగా అందరినీ రిలీజ్ డేట్ విషయంలో ఆశ్చర్యపరిచారు. మొదట బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని జనవరి 14 విడుదల చేస్తామని చెప్పి జనవరి 11 కే విడుదల చేసి అందరినీ హీరోని,నిర్మాతను ఆనందపరిచారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడదే విధంగా కెమెరామెన్ గంగతో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యేలా మంచి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్‌ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్‌ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

Story first published: Thursday, August 23, 2012, 08:08 [IST]
Topics: pawan kalyan, chiranjeevi, tamanna, cameraman ganga tho rambabu, puri jagannath, పవన్ కళ్యాణ్, తమన్నా, కెమెరామెన్ గంగతో రాంబాబు, చిరంజీవి
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS