షాకిచ్చిన 'కెమెరామెన్‌ గంగతో...' ఓవర్ సీస్ బిజెనెస్

Published: Monday, August 27, 2012, 16:06 [IST]

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్,పవన్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా షాకిచ్చే రేంజిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకూ ఏ హీరోకు లేనంతగా అమెరికా మినహా ఓవర్ సీస్ బిజెనెస్ కోటి రూపాయలు జరిగింది.

వివరాల్లోకి వెళితే...ఎక్సలియర్ ఇండియా ఎంటర్టైన్మెంట్సా వారు ఆస్ట్రేలియా,న్యూజ్ లాండ్ రైట్స్ ని 30 లక్షలుకు తీసుకున్నారు. అలాగే కలర్స్ మీడియా వారు యుకె,యూరప్ ఏరియాలకు గానూ ముప్పై లక్షలకు తీసుకున్నారు. ఇక కువైట్,గల్ఫ్ ప్రాంతం ఏరియాలకు నలభై లక్షలకు గానూ కె.జాని రత్న కుమార్ తీసుకున్నారు. మొత్తం కోటి రూపాయల వ్యాపారం జరిగింది. ఇక యు.ఎస్ రైట్స్ ని నిర్మాత దానయ్య తన వద్దే ఉంచుకున్నారు. గబ్బర్ సింగ్ బిజినెస్..ఓవర్ సీస్ లో బాగా జరగటంతో ఈ సినిమాకు ఈ రేంజి రేటు పలుకుతోంది.

ఇక ఈ చిత్రం విడుదల తేదీ మొదట అక్టోబర్ 11న ఫిక్స్ చేసారు. సాధారణంగా రిలీజ్ డేట్స్ షూటింగ్స్ పూర్తవకో,బిజినెస్ లేటయ్యో ముందుకు పోతూంటాయి..కానీ పూరి రివర్స్ లో ..ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తూ అతి తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేయటమే కాకుండా ముందు అనుకున్న విడుదల తేదీని కూడా కాదని,ముందుకు రిలీజ్ డేట్ తెచ్చి షాక్ ఇస్తున్నారు. ఇది పవన్ అభిమానులకే కాక అందరికీ ఆనందం కలిగించే విషయం.

ఈ చిత్రం తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్‌ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్‌ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌ సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

Story first published: Monday, August 27, 2012, 16:06 [IST]
Topics: pawan kalyan chiranjeevi tamanna cameraman ganga tho rambabu puri jagannath పవన్ కళ్యాణ్ చి రంజీవి తమన్నా కెమెరామెన్ గంగతో రాంబాబు పూరి జగన్నాథ్
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS