ఈగ @ $.1M...పవన్, మహేష్ రికార్డ్స్ స్మాష్

Published: Monday, July 23, 2012, 12:36 [IST]

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రం యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నిన్నటితో 3 వీకెండ్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 1 మిలియన్ అమెరికన్ డాలర్స్ వసూలు చేసి చరిత్ర తిరగరాసింది. గతంలో మహేష్ బాబు దూకుడు చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా ఉండగా...దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం తుడిచేసింది. తాజాగా ఈ ఇద్దరి రికార్డును రాజమౌళి ‘ఈగ' దెబ్బకు గల్లంతయ్యాయి.

సుదీప్, సమంత, నాని ముఖ్య పాత్రలు పోషించిన ఈగ చిత్రం అమెరికాలో విడుదలైన తొలి నాలుగు రోజులతో కలుపుకుని ఫస్ట్ వీక్ లో రూ. 3.65 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్స్ అక్కడ ఈ రేంజిలో రావడం ఒక రికార్డే. అయితే తొలుత ఈ చిత్రం థియేటర్ల సమస్య కారణంగా తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. లేకుంటే కలెక్షన్లు మరిన్ని ఎక్కువ వచ్చేవి.

ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాతలు సెకండ్ వీక్ నుంచి మరో 20 స్క్రీన్లు పెంచారు. దీంతో రెండో వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 1.35 కోట్ల వసూళ్లతో మొత్తం రూ. 4.99 కోట్లు కలెక్ట్ చేసింది. అనంతరం ఈ చిత్రాన్ని లోకల్ ఇంగ్లీష్ పీపుల్ కూడా చూసే విధంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్ వేసి రిలీజ్ చేశారు. దీంతో ఈగ చిత్రం మూడో వీకెండ్ గడిచే సరికి 1 మిలియన్ డాలర్స్ మార్కును దాటింది.

గతంలో స్టార్ హీరోలు మాత్రమే రికార్డులు బద్దలు కొట్టగలరు అనే భావన ఉండేది. కానీ దర్శకుడు తలుచుకుంటే హీరో లేకుండా కూడా రికార్డులను తిరగరాయగలడు అని నిరూపించిన రాజమౌళిని పరిశ్రమలోని వారంతా అభినందిస్తున్నారు. ఈగ చిత్రం జులై 6న విడుదలైంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రంపై ఈచిత్రాన్ని నిర్మించగా డి. సురేష్ బాబు సమర్పణలో రిలీజ్ అయింది. కీరవాణి సంగీతం అందించారు.

Story first published: Monday, July 23, 2012, 12:36 [IST]
Topics: eega rajamouli gabbar singh dookudu ఈగ రాజమౌళి గబ్బర్ సింగ్ దూకుడు
తాజా అప్‌డేట్స్ కోసం Oneindia Telugu App డౌన్‌లౌడ్ చేసుకోండి Android IOS